అమరజీవి ఆశయ సాధనకు కృషి
అనకాపల్లి: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయసాధనకు యువత కృషి చేయాలని అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, తన ప్రాణాలను త్యాగం చేసి చరిత్రలో అమరజీవిగా నిలిచిపోయారన్నారు. కార్యాలయం పరిపాలనాధికారి సి.హెచ్.తిలక్ బాబు, సీఐలు లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, ఎస్‌ఐ సురేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.


