రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు చీడికాడ విద్యార్థులు
విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మధు
చీడికాడ: రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు చీడికాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు అక్షరశ్రీ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ బి.మధు తెలిపారు. ఈనెల 14న విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీలలో 40 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు యర్రా హానిస్ సార్ట్ జూనియర్ లెవెల్–1, యర్రా గ్రీష్మ జూనియర్ లెవెల్–1, గెంజి భరత్ స్టార్ జూనియర్ లెవెల్–3 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని మధు తెలిపారు.


