విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న పాల వ్యాన్
బుచ్చెయ్యపేట: మండల కేంద్రంలో పాల వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆదివారం తెల్లవారు జామున రాజాం నుంచి బుచ్చెయ్యపేట వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపోగా, ట్రాన్స్‌ఫార్మర్ కింద పడి వైర్లు తెగి పడ్డాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో పాటు లారీ వేగానికి చెట్లు విరిగి పడ్డాయి. నిత్యం జనాల రద్దీతో ఉండే ఈ రోడ్డులో తెల్లవారు జామున ప్రమాదం జరగగా, జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుని కాలు విరిగిపోగా స్థానికులు కిందకి దించి సపర్యలు చేశారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కశింకోట– బంగారుమెట్ట(కేబీ) ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆనుకుని విద్యుత్ స్తంభాలు వేయడంతో తరుచూ పలు ప్రమాదాలు జరుగుతున్న విద్యుత్ శాఖ, ఆర్‌అండ్‌బీ, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.


