రేపు మాదిగల ఆత్మీయ కలయిక
పిక్నిక్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యలక మల్లిబాబు
అనకాపల్లి: జిల్లా మాదిగ జాతి ఐక్యతను చాటి చెప్పేందుకు కశింకోట మండలం బయ్యవరంలోని ప్రమీల గార్డెన్‌లో ఈనెల 16న ఉదయం 10 గంటలకు మాదిగల ఆత్మీయ కలయిక(వనసమారాధన) నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యలక మల్లిబాబు తెలిపారు. ఆదివారం స్థానిక మెయిన్‌రోడ్డులోని ఎమ్మార్పీస్ కార్యాలయంలో ఆత్మీయ కలయిక పోస్టర్‌ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఇప్పటికై నా మాదిగలను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ జిల్లా నాయకులు కట్టమూరు మంగరాజు, కొల్లి చిన్న అప్పారావు, వెలుసూరి గాటీలు, చెవ్వేటి అప్పారావు, కాకినాడ కనకేశ్వరరావు, చెవ్వేటి నాగరాజు, ముప్పిడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


