హస్త కళల్లో విజయాలు సాధించాలి
స్పీకర్ అయ్యన్న
గొలుగొండ: కార్పెంటర్లు అన్ని రంగాల్లో రాణించి ప్రాచీన హస్త కళలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట గ్రామంలో శిక్షణ తీసుకున్న సుమారు 50 మంది హస్తకారులకు ఆదివారం రూ.5 లక్షల విలువైన పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వీకర్ మాట్లాడుతూ ఏటికొప్పాక బొమ్మలు ఎంతో గుర్తింపు పొందాయని, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న వారు వస్తువులు తయారు చేసి గుర్తింపు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఆపర్ణలక్ష్మి, విశాఖ లేపాక్షి మేనేజర్ కార్తీక్, విజయవాడ లేపాక్షి మేనేజర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


