జిల్లా జీజేఏఎల్ అధ్యక్షునిగా సుందరావు
జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల అసోసియేషన్ నూతన కార్యవర్గం
అనకాపల్లి: జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అసోసియేషన్(జీజేఏఎల్) అధ్యక్షుడిగా కె.సుందరావు(మాకవరపాలెం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మెయిన్‌రోడ్డు జీవీఎంసీ పెద్ద హైస్కూల్ ఆవరణలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఆర్.గంగరాజు(కేడీ పేట), కార్యదర్శిగా కె.పి.కుమార్(పాయకరావుపేట), సహాయ కార్యదర్శి బి.ఉషారాణి(నక్కపల్లి), కోశాధికారిగా ఎం.శ్రీనివాసరావు(నర్సీపట్నం), లైబ్రెరీ కార్యదర్శిగా పి.వి.కల్యాణి(పరవాడ), రాష్ట్ర కౌన్సిలర్‌గా వై.స్వామి(నర్సీపట్నం) ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విశాఖ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.పి.నాయుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.ఎం.కె.ఎం.నాయుడు వ్యవహరించారు. ప్రభుత్వ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.సుందరావు తెలిపారు.


