యువతిని మోసగించిన యువకుడి అరెస్టు
పాయకరావుపేట : యువతిని ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు సీఐ జి.అప్పన్న తెలిపారు. మండలంలో రాజయ్యపేటకు చెందిన అమ్మాయిని, తొండంగి మండలం వేమవరం గ్రామానికి చెందిన ఒక యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేయడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్ధానిక వైజంక్షన్ వద్ద సదరు యువకుడిని అదుపులోనికి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితుడిని శనివారం యలమంచిలి కోర్టుకి తరలించగా కోర్డు అతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చిందన్నారు. అతని వద్ద నున్న మోటారు బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.


