ఉపాధ్యాయుల ఆటల పోటీలు ప్రారంభం
క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న స్పీకర్
నర్సీపట్నం: ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి ఆటల పోటీలను స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో ఉన్న క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. వెనకబడిన విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో యోగాలో విద్యార్థులకు తర్పీదు ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలోని 38 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధుల నుంచి ఒక్కొక్క స్కూల్‌కు రూ.5 లక్షలు ఇస్తానన్నారు. అనంతరం బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్. ఎంఈవో సిహెచ్.తలుపులు, 12 మండలాలకు చెందిన ఎంఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


