సీట్ల మధ్య ఇరుక్కుపోయా | - | Sakshi
Sakshi News home page

సీట్ల మధ్య ఇరుక్కుపోయా

Dec 13 2025 7:39 AM | Updated on Dec 13 2025 7:39 AM

సీట్ల

సీట్ల మధ్య ఇరుక్కుపోయా

వీధిలోని స్నేహితుల కోరిక మేరకు ఆంధ్రా ప్రాంతం చూసేందుకు వచ్చి బస్సు ప్రమాదానికి గురయ్యాం. ప్రమాద సమయంలో బస్సులో సీట్ల మధ్య ఇరుక్కుపోయాం. చీకటిలో ఏమీ కానరాక అయోమయానికి గురయ్యాం. వెలుగు వచ్చాక ఎవరో మమ్మల్ని బయటకు తీశారు.

– షేక్‌ అష్రఫ్‌, చిత్తూరు

ముగ్గురిని కోల్పోయా

బస్సు ప్రమాదంలో నా కూతురు సునంద, అల్లు డు శివశంకర్‌రెడ్డి, భర్త మేనకోడలు శ్రీకళను కోల్పోయా. నా చేతికి కూడా తీవ్రగాయమైంది. టీచర్‌గా చేసిన నేను రిటైర్డ్‌ అయ్యాను. తీర్థయాత్రల కోసం వచ్చి కుటుంబంలో ముగ్గురిని కోల్పోవాల్సి వచ్చింది.

– వరిగపల్లి కుమారి, చిత్తూరు

దేవుడి దయతో బయటపడ్డాం

చిత్తూరులోని బంధువులు తీర్థయాత్రలకు వెళుతు న్నాం మీరు కూడా రమ్మ ని చెబితే బెంగళూరు నుంచి 12 మంది వచ్చాం. బస్సు ప్రమాదంలో మా బృందంలోని కృష్ణకుమారిని కోల్పోయాం. దేవుడి దయతో మిగతావాళ్లం సురక్షితంగా బయటపడ్డాం.

– పాపరి జవహరి, బెంగళూరు

ఇలా జరుగుతుందనిఅనుకోలేదు

గత 25 ఏళ్లుగా వజ్రమణి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ పేరుతో తీర్థయాత్రలకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నా. గతంతో ఎన్నడూ ఇలా జరగలేదు. బస్సు కూడా కండీషన్‌లోనే ఉంది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.

– వజ్రమణి, టూర్‌ ఆర్గనైజర్‌, చిత్తూరు

సీట్ల మధ్య ఇరుక్కుపోయా 
1
1/3

సీట్ల మధ్య ఇరుక్కుపోయా

సీట్ల మధ్య ఇరుక్కుపోయా 
2
2/3

సీట్ల మధ్య ఇరుక్కుపోయా

సీట్ల మధ్య ఇరుక్కుపోయా 
3
3/3

సీట్ల మధ్య ఇరుక్కుపోయా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement