రసాయనిక పరిశ్రమల్లో భద్రత ముఖ్యం
డాబాగార్డెన్స్: రసాయన, పెట్రో కెమికల్ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(విజయవాడ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్, జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్‌రెడ్డి, సిపెట్ డైరెక్టర్ సి.హెచ్.శేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పారిశ్రామిక భద్రతా చర్యలు, నిబంధనలపై ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రమాదాలకు ఆస్కారమున్న విభాగంలోని 60 రసాయన పరిశ్రమల నుంచి 108 మంది భద్రతాధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ప్రమాద అంచనా, నిర్వహణ, అత్యవసర ప్రణాళిక, ప్రతిస్పందన వ్యూహాలు, భద్రతా పద్ధతుల్లో అధునాతన సాంకేతికత వంటి అంశాలపై మొత్తం 11 సెషన్లు నిర్వహించనున్నారు. సిపెట్, ఐఐటీ, ఐఐపీఈ, ఎన్‌డీఆర్‌ఎఫ్(10వ బెటాలియన్)కు చెందిన నిపుణులు ఈ అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ సి.హెచ్.శేఖర్ తెలిపారు.
రసాయనిక పరిశ్రమల్లో భద్రత ముఖ్యం


