విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయంబర్సుమెంటు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ తెలిపారు. స్థానిక నెహ్రూచౌక్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్‌మెంట్ తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 8న అమరావతిలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య శాంతియుతంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తే, అక్కడ పోలీసులతో ప్రభుత్వం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చడం అన్యాయమన్నారు. తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ డైరెక్షన్‌లో పోలీస్‌లు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాయి రాజా, నాయకులు కృష్ణచైతన్య, కిట్టు, డేనీ, శ్రీకాంత్, మడక కార్తీక్, కళ్యాణ్, కాండ్రేగుల శ్యాం, డొంక సత్య, మళ్ల వంశీ, కోలా గణేష్, శివకుమార్, శివ ప్రసాద్, ప్రభాకర్, సతీష్, మణికంఠ, మురళీ, హేమంత్, రవివర్మ, మహేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


