జీవో 1491ను సవరించాలి
మునగపాక : కొత్తగా ఏర్పాటు చేయబోయే నక్కపల్లి రెవెన్యూ కేంద్రంలో యలమంచిలి నియోజకవర్గాన్ని కలపకుండా చూడాలని కోరుతూ మునగపాకలో రైతుల సహకారంతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుదవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. గతంలో వలే అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలిని కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు,పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనా యుడు,మండల సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు కాండ్రేగుల నూకరాజు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి యలమంచిలి నియోజకవర్గం అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగుతూ వస్తుందన్నారు. నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్ కారణంగా ఇబ్బందులు తప్పవన్నారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసకు గురికావాల్సి వస్తుందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 1491ను సవరించి ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. అనకాపల్లి కేంద్రంగా కొనసాగుతున్న రెవెన్యూ డివిజన్‌లోనే యలమంచిలి ఉండేలా చూడాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమం తప్పదన్నారు. సర్పంచ్‌లు ఇందల నాయుడు, భీశెట్టి గంగప్పలనాయుడు, కారుకొండ రాజు, మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు,ఎంపీటీసీ సూరిశెట్టి రాము, పార్టీ నేతలు శీరా రమణమ్మ, ఆడారి కాశీబాబు, కరణం కాంతమ్మ, గుంట్ల అప్పారావు, ఎంఎం నాయుడు, ఆడారి రమణబాబు, మళ్ల రామజగన్నాథం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడో రాజు వాడ్రాపల్లి, మల్లవరం, గొల్లలపాలెం, నాగవరం గ్రామాలకు చెందిన కన్నుంనాయుడు, రామజోగినాయుడు, భాస్కరరావు, భూలేక, లక్ష్మణరావు, రవి, శ్రీను, రమణ బాబు, నూకప్పారావు, జోగినాయుడు, రమణ, బర్ల వెంకునాయుడు, శీరా అప్పారావు, చొప్పా గంగరాజు, గోపాలకృష్ణ, బర్ల నూకప్పారావు, ఈశ్వరప్పారావు, కర్రి అప్పారావు, ఇందల రమేష్, సాలాపు శ్రీను, రావి రమణ, బాబూరావు, వెంకట గణేష్,పాలిపిని నాయుడు,అప్పికొండ శ్రీనివాసరావు, సూరిబాబు, సంజీవరావు, పాలిపిని అప్పారావు, పాలిపిని శ్రీను, రమణబాబు, సన్యాసిరావు, రుత్తల రాము,పాలిపిని నాగ వెంకట అప్పారావు దీక్షలో కూర్చొన్నారు.


