ఆర్సెలర్ మిట్టల్ టౌన్‌షిప్‌కు భూములు ఇవ్వం
తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
నక్కపల్లి: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసే టౌన్‌షిప్ కోసం భూములు ఇచ్చే ప్రసక్తి లేదని నెల్లిపూడి రైతులు స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన పలువురు బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, రైతులు టి.పేర్రాజు, అప్పలరాజు, జోగిరాజు తదితరులు మాట్లాడుతూ ఇప్పటికే స్టీల్‌ప్లాంట్ కోసం ప్రభుత్వం 2020 ఎకరాలు కేటాయించిందన్నారు. ఇది చాలదన్నట్లు టౌన్‌షిప్ ఏర్పాటుకు మరో 400 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతులంతా ఉపాధి కోల్పోతారన్నారు. అదనంగా భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతుల అంగీకారం లేకుండా భూములను బలవంతంగా సేకరించడం తగదన్నారు. ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రైతుల భూములు బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భూసేకరణ ప్రక్రియ నిలుపుదల చేయాలన్నారు.
టిడ్కో కాలనీలో అర్ధరాత్రి యువకుడి వీరంగం


