● ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతి కోసం హైదరాబాద్
యలమంచిలి రూరల్ : పట్టణంలోని టిడ్కో కాలనీలో మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక యువకుడు సైకోలా ప్రవర్తించి వీరంగం సృష్టించాడు. తాను ఇష్టపడిన యువతి కోసం వచ్చిన యువకుడు ఆమె మాట్లాడ్డానికి నిరాకరించడంతో రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. కాలనీలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు, ఆటో ముందుభాగంలో ఉన్న అద్దాలు పగలగొట్టాడు. పలు ద్విచక్ర వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యలమంచిలి టిడ్కో కాలనీలో ఉంటున్న యువతికి హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత యువకుడి ప్రవర్తన నచ్చకపోవడం, వివాహం చేసుకోవాలని బలవంతం చేయడంతో అందుకు యువతి నిరాకరించి మాట్లాడడం మానేసింది. మంగళవారం హైదరాబాదు నుంచి యలమంచిలి టిడ్కో కాలనీకి వచ్చిన యువకుడు యువతితో గొడవపడ్డాడు. అనంతరం వాహనాల విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో టిడ్కో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
● ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతి కోసం హైదరాబాద్


