లింగ నిర్ధారిత వీర్యంపై అవగాహన కల్పించండి
సమావేశంలో మాట్లాడుతున్న పశుసంవర్ధకశాఖ ఏడీ దినేష్‌కుమార్
కె.కోటపాడు : ఆడపెయ్యిల జననంకు లింగ నిర్ధారిత వీర్యం ఆవులు, గేదెలకు వేయించేలా పాడి రైతులకు పశువైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కె.కోటపాడు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ.దినేష్‌కుమార్ తెలిపారు. కె.కోటపాడులో బుధవారం కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల పశువైద్యాధికారులు, పశువైద్య సహాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదికి కె.కోటపాడు మండలంలో 1000 పశువులకు, దేవరాపల్లిలో 810 పశువులకు ఆడపెయ్యిల జననంకు లింగ నిర్ధారిత వీర్యం వేయించే చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో డోసుకు రైతుల వద్ద నుంచి రూ.150 మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా గోట్ ఫాక్స్ టీకాలను గొర్రెలు, మేకలకు, గొంతు వ్యాధి నివారణ టీకాలను ఈ నెల 25లోగా లక్ష్యం మేరకు పూర్తి చేయాలని దినేష్‌కుమార్ సూచించారు. కార్యక్రమంలో కొరువాడ, చౌడువాడ, దేవరాపల్లి మండలాల పశువైద్యాధికారులు సిహెచ్.వై.నాయుడు, సింహచలంనాయుడు, మంజూష, ప్రియాంక, గాయత్రి, పశువైద్య సిబ్బంది సమీరా పాల్గొన్నారు.


