ఇప్పటికీ ఈ రాష్ట్రంలో, దేశంలో వైద్యం ఖరీదైన సేవ.. వైద్య
●చోడవరం టౌన్‌లో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడ నుంచి వందలాది మంది మేధావులు, యువత, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో చోడవరం నుంచి ర్యాలీగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చారు.
●అడ్డురోడ్డులో గల పాయకరావుపేట నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో ర్యాలీగా అనకాపల్లి తరలించారు.
●అనకాపల్లి పట్టణంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
●మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి మండలంలో తారువలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపుగా గంటసేపు జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి అక్కడ నుంచి 2 కి.మీ దూరం ర్యాలీ చేశారు.
●నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు పాల్గొన్నారు.
●యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో యలమంచిలి టౌన్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై..అక్కడ నుంచి ఎల్‌ఐసీ కూడలి మీదుగా ర్యాలీ చేసుకుంటూ జాతీయ రహదారి మీదుగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
●పెందుర్తి నియోజకవర్గంలో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో సంతకాల పత్రాలను అనకాపల్లి జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకెళ్లారు.


