పెండింగ్ కేసులు వేగంగా పరిష్కరించాలి
ఎస్.రాయవరం: పెండింగ్ కేసులు వేగంగా పరిష్కరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌ను, అడ్డురోడ్డులో ఉన్న సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల ఫైళ్లను పరిశీలించి లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యే కేసులను గుర్తించి రాజీ చేయాలన్నారు. పెండింగ్ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు పూర్తి వివరాలు నమోదు చేసి పారదర్శకంగా వ్యహరించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళా భద్రత, విద్యార్ధుల భద్రత కోసం సచివాలయాల్లో పోలీసు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ తనిఖీల్లో నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, నక్కపల్లి సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్‌ఐ ఎ.విభీషణరావు పాల్గొన్నారు.


