మాడుగుల నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు
● సంతకాల పత్రాలు పార్టీ జిల్లా
కార్యాలయానికి నేడు అందజేత
● మాజీ డిప్యూటీ సీఎం
బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఈ మేరకు తారువలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మెడికల్ కళాశాలలను ప్రెవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మాడుగుల నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాల సేకరణ చేపట్టామన్నారు. వీటి పత్రాలను బుధవారం తారువ గ్రామం నుంచి ప్రత్యేక వాహనంలో అనకాపల్లిలో గల పార్టీ జిల్లా కార్యాలయానికి అందజేస్తామన్నా రు. బుధవారం ఉదయం 9.30 గంటలకు సంతకాల పత్రాలతో కూడిన వాహనం తారువ నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మాడుగుల నియో జకవర్గంలో గల నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.


