పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు ఓ భాగమే
● ఎస్పీ తుహిన్ సిన్హా
● రిటైర్డ్ హోంగార్డు చల్లపల్లికి సాయం
అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డుల సేవ లు ఒక భాగమేనని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. చోడవరం పోలీస్ స్టేషన్‌లో కమ్యూనికేషన్ హోంగార్డుగా సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చల్లపల్లి రామకోటేశ్వరరావుకు తోటి హోంగార్డులు తమ ఒక రోజు గౌరవ వేతనం రూ.4.00,530 చెక్కును ఎస్పీ చేతులమీదుగా సోమవారం అందజేశారు. హోంగార్డుగా చల్లపల్లి చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ ప్రశంసనీయమన్నారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు గౌరవ వేతనాన్ని స్వచ్ఛందంగా అందజేయడం అభినందనీయమన్నారు. కార్యాలయ పరిపాలన అధికారి తిలక్ బాబు, రిజర్వ్ సీఐ బి.రామకృష్ణారావు, జూ.అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.


