పది హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్
యలమంచిలిలో టెన్త్ పరీక్ష కేంద్రాన్నిపరిశీలిస్తున్న పరీక్షల సహాయ కంట్రోలర్
యలమంచిలి రూరల్: వచ్చే మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల హాల్‌టికెట్లపై ఈసారి క్యూఆర్ కోడ్ ముద్రించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి ఎ.శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో వెతుక్కునే ఇబ్బందులు విద్యార్థులకు ఉండవన్నారు. ఆలస్యం లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చన్నారు. సోమవారం యలమంచిలి పట్టణంలో నాలుగు టెన్త్ పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాల, కొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ ఇంగ్లీషు మీడియం స్కూల్, శ్రీచైతన్య స్కూళ్లలో వసతులు పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో–1 సుసర్ల సూర్యప్రకాష్, ప్రధానోపాధ్యాయులు వైవీ రమణ, కీర్తి శేఖర్, ఉత్తమ ఉపాధ్యాయుడు మువ్వల రాంబాబు ఉన్నారు.


