రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు కౌశిక్
అనకాపల్లి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి విద్యార్థి కౌశిక్ ఎంపికయ్యాడు. స్థానిక జీవీఎంసీ మెయిన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సదరు విద్యార్థిని హెచ్‌ఎం బ్రహ్మాజీ, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, అక్కడా సత్తా చాటాలని ఈ సందర్భంగా హెచ్‌ఎం ఆకాంక్షించారు. స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.వి.నరసింహం పాల్గొన్నారు.


