రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: స్థానిక రైల్వేస్టేషన్‌లో సోమవారం రాత్రి రైలు నుంచి జారి పడి అనకాపల్లి శ్రీరామనగర్‌కు చెందిన పెలూరి అప్పారావు (55) మృతి చెందాడు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న రైలు నుంచి జారి పడినట్టు తెలిసింది. 108 వాహనంలో యలమంచిలి రైల్వేస్టేషన్ నుంచి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రైళ్లలో అప్పారావు పాప్‌కార్న్ అమ్ముతుంటాడని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది తెలిపారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై తమకు పూర్తి వివరాలు అందలేదని తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.


