చిత్రలేఖన విద్యార్థికి అభినందన
మాడుగుల: మాడుగుల గ్రామానికి చెందిన పుట్టా రోహిత్ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్నాడు. గత నెలలో ఢిల్లీలో కళాయి కూడమ్ సంస్థ ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం విదితమే. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సోమవారం పాఠశాలలోకి వెళ్లి రోహిత్‌కు దుశ్శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించారు. రానున్నకాలంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బండారు ముత్యాల నాయుడు, సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఎడ్ల హేమంత్‌కుమార్, కుక్కర శ్రీధర్ పాల్గొన్నారు.


