క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 30 మంది ఎంపిక
ఇంటర్వ్యూల్లో ఎంపికై న విద్యార్థులు
పాయకరావుపేట: స్పేసెస్ డిగ్రీ కళాశాలలో హెటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో బుధవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల నుంచి బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ చదువుతున్న లేదా పూర్తయిన విద్యార్థులు సుమారు 100 మంది హాజరయ్యారు. సంస్థ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ జి.రాజు కంపెనీ నియమ, నిబంధనలు తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూల్లో 30 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు విద్యా సంస్ధల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్‌ప్రకాష్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్ సిహెచ్.మణికంఠ, వైస్ ప్రిన్సిపాల్ పెనుగొండ సుబ్బారావు, ఐక్యూ ఐసీ కో ఆర్డినేటర్ డాక్టర్ అరుణకుమార్ త్రిపాఠి, తదితరులు పాల్గొన్నారు.


