ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

Nov 27 2025 6:09 AM | Updated on Nov 27 2025 6:09 AM

ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

అనకాపల్లి టౌన్‌ : చదువు మీద అశ్రద్ధతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జరిగింది. పట్టణ క్రైం ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాల ప్రకారం..గొలుగొండ మండలం సోజ్యం గ్రామానికి చెందిన భీమిరెడ్డి రామరాజు(16) పట్టణంలోని గవరపాలెం అగ్గిమర్రి చెట్టు వద్ద నివాసముంటున్న మేనమామ రాజాబాబు ఇంటిలో ఉంటూ అనకాపల్లి ఏఎమ్‌ఎఏల్‌ కళాశాలలో ఇంటర్‌ మెదటి సవత్సరం చదువుతున్నాడు. అయితే మెదటి నుంచి చదువు మీద ఆసక్తి లేదని తరచూ చెప్పిన రామరాజు తొమ్మిదో తరగతి చదువుతున్న తన తమ్ముడు సెల్‌ఫోన్‌కి నేను చనిపోతున్నానంటూ మంగళవారం రాత్రి మెసేజ్‌ చేశాడు. అయితే తమ్ముడు వెంటనే చూడలేదు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో మెసేజ్‌ చూసి మేనమామకి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అయ్యప్ప మాల వేసుకొవడం వల్ల మరోచోట పీఠంలో ఉన్న మేనమామ వెంటనే ఇంటికి వెళ్లి చూడగా గదిలో ఉరివేసుకున్న మేనల్లుడు కనిపించాడు. వెంటనే బంధువులకు తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మృతుడి తండ్రి కొంతకాలంగా వేరో చోట ఉండగా తల్లి లోవ మూగరాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement