అంతర్జాతీయ పోటీల్లో లింగేశ్వరరావుకు పతకాలు
ఉక్కునగరం : అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో స్టీల్‌ప్లాంట్ మాజీ ఉద్యోగి లింగేశ్వరరావుకు రెండు విభాగాల్లో బంగారు, రజత పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో థాయ్‌లాండ్‌లోని పటాయలో ఈ నెల 21 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్–2025 పోటీలు నిర్వహించారు. 35 ఏళ్లు నుంచి 75 ఏళ్లు వరకు వయసు కలిగిన క్రీడాకారులకు నిర్వహించిన ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ నుంచి పాల్గొన్న లింగేశ్వరరావు 55+ మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో తమిళనాడుకు చెందిన సుజానే వింగ్‌లెట్‌తో పాల్గొని బంగారు పతకం గెలుపొందారు. మెన్ డబుల్స్ కేటగిరీలో తమిళనాడుకు చెందిన కార్తికేయన్ వాసుతో పాల్గొని రజత పతకం సాధించారు.


