చింతపాక రేషన్ డిపోపై 6ఏ కేసు
బుచ్చెయ్యపేట: మండలంలో చింతపాక రేషన్ డిపోపై అధికారులు 6ఏ కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్ నాగమణి పలువురు లబ్ధిదారుల వద్ద వేలిముద్రలు తీసుకుని రేషన్ సరకులు ఇవ్వలేదు. దీనిపై వారంతా ఫోన్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ లక్ష్మి, సీఎస్‌డీటీ భాస్కర్, వీఆర్వో రవితేజ సిబ్బంది మణి రేషన్ డిపోను తనిఖీ చేశారు. డిపోలో రికార్డులో నమోదు ప్రకారం రేషన్ సరుకుల వ్యత్యాసాన్ని పరిశీలించారు. అదనంగా 110 కేజీల బియ్యం ఉండటాన్ని గుర్తించారు. దీంతో రేషన్ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసి డిపోను సీజ్ చేశారు. పక్క గ్రామమైన సీతయ్యపేట రేషన్ డీలర్‌కు చింతపాక రేషన్ డిపో అదనపు బాధ్యతలు అప్పగించారు.


