భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
రాంబిల్లి(అచ్యుతాపురం): అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్‌లో పరిశ్రమల స్థాపన కోసం భూములిచ్చిన నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంద ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, యలమంచిలి నియోజక వర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో కలిసి రాంబిల్లి మండలం కృష్ణపాలెంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తామంతా కృష్ణంపాలెంలో పర్యటించినట్టు తెలిపారు. భూనిర్వాసితులకు గతంలో కేటాయించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను మార్చకూడదని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాను తరచూ మార్చడం సమంజసం కాదన్నారు. కృష్ణంపాలెం భూనిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే ఇక్కడి నుంచి తరలించాలన్నారు. స్థానికులందరికీ ఇక్కడ ఏర్పాటుచేస్తున్న పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక్క నిర్వాసితుడికి అన్యాయం జరిగినా వైఎస్సార్ సీపీ పోరాడతుందని స్పష్టం చేశారు. అనంతరం పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, అసెంబ్లీ నియోజక వర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ కృష్ణపాలెం భూ నిర్వాసితుల కోసం పోరాడతామని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు కిశోర్, ఎంపీపీ శిరీ షా శ్రీనుబాబు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు, యువజ న నాయకుడు ధూళి వెంకీ, అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాంబాబు, అచ్యుతాపురానికి చెందిన కోన బుజ్జి, నెట్టెం సత్యనారాయణ, నీరుకొండ వెంకట సూర్యనారాయణ, బద్ది హరిబాబు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం


