ఇంటింటి కుళాయిల పనులు త్వరలో పూర్తి
జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి
చోడవరం: అసంపూర్తిగా ఉన్న ఇంటింటి కుళా యి పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి చెప్పారు. గోవాడ, అంబేరుపురం గ్రామా ల్లో సీఈవో నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఆర్‌ఈవో జె.అనిల్ కుమార్, డిప్యూటీ ఈఈ ఎ.సూర్యనారాయణ, ఏఈ సీహెచ్ నర్సింహరావుతో కూడిన అధికారుల బృందం గురువారం పర్యటించి, అసంపూర్తిగా ఉన్న జల్‌జీవన్ మిషన్ పథకం పనులను పరిశీలించింది. ఈసందర్భంగా గోవా డ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు మాట్లాడుతూ గ్రామంలో కొన్ని ఇళ్లకుకుళాయిలు వేయకపోవడంతో గ్రామ స్తులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కుళాయిలు వేయాలని కోరారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించింది. గోవాడలో 10శాతం మేర ఇళ్లకి కుళాయిలు వేయలేదని, వాటికి త్వరలోనే వేయిస్తామని సీఈవో చెప్పారు. అంబేరుపురంలో మంచినీటి సమస్యను సర్పంచ్ కార్లె ఈశ్వరమ్మ అధికారులకు వివరించారు. రాయపురాజుపేటలో గల పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఈవో తెలిపారు.


