ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు
విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్
అనకాపల్లి: కొత్తజిల్లాల్లో ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. స్థానిక గవరపాలెం నిదానందొడ్డి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా విద్యుత్‌శాఖ సర్కిల్ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికి నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తున్నట్టు చెప్పా రు. ఎంఆర్‌టీ, డీపీఈ, సివిల్, ఏపీటీఎస్ కార్యాలయాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయని, వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ సీఎండీ పృథ్వీతేజ్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విద్యుత్‌శాఖ జిల్లా సర్కిల్ అధికారి జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గవరపాలెంలో గల నూకాంబిక అమ్మవారి బాలాలయంలో అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
జిల్లాలో 10 సబ్ స్టేషన్లకు అనుమతి
కె.కోటపాడు: జిల్లాలో ఇప్పటికే 10 సబ్ స్టేషన్లకు అనుమతులను ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చౌడువాడలో రూ.3.65 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం స్విచ్‌ను ఆన్ చేసి సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20వేల ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్‌ను ఉచి తంగా సమకూర్చనున్నట్టు తెలిపారు. గ్రామంలో మంచినీటి ట్యాంక్, సీసీ రోడ్లు ప్రారంభించారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం
మాడుగుల రూరల్: మండలంలోని కింతలిలో నూతనంగా నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మండలంలో మరో విద్యుత్ ఉప కేంద్రం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.


