
ఆందోళనకు టీడీపీ దూరం.. ఊరి సమస్యలోనూ రాజకీయమే!
రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ప్రారంభంలో గ్రామస్తుల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది టీడీపీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నప్పటీకి హోంమంత్రిని అడ్డుకున్న తర్వాత టీడీపీ నాయకులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు. మిగిలిన మత్స్యకారులు మాత్రమే ఆందోళన కొనసాగిస్తున్నారు. మత్స్యకారులంతా గ్రామం కోసం, ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే రాజకీయ కారణాలతో టీడీపీ నాయకులు ముఖం చాటేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు, వారి ఫొటోలు, బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు టీవీల్లో, పత్రికల్లో రావడంతో.. మన ప్రభుత్వమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే మీరెలా నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటారని పార్టీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది.