
అనంతుని పవిత్రోత్సవాలు ప్రారంభం
పాత సంత స్థలంలో మేదిని మాతకు పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో గురువారం రాత్రి వేద పండితుల వేద మంత్రోచ్ఛారణాల నడుమ పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి కుంతీ మాధవ స్వామి ఆలయంలోని చక్ర పెరుమాళ్లను పల్లకిలో పాత సంత స్థలం వద్దకు పల్లకీలో తోడ్కొని వచ్చారు. ఇక్కడ మేదిని మాతకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాలాడ పద్మనాభం, కంటుబోతు ఎర్నాయుడు, మొకర అప్పలనాయుడు, తాలాడ పైడిరాజు, అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.