
గ్రావెల్ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ దాడులు
సాక్షి, అనకాపల్లి: గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు బుధ, గురువారాల్లో దాడులు చేశారు. రాంబిల్లి మండలం చినపూడి గ్రామంలో షిర్డీ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు చేసి, అక్కడున్న వాహనాలను సీజ్ చేశారు. ఎంత ఏరియాలో గ్రావెల్ తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని కొలతలు వేసిన చినపూడి వీఆర్‌వో కేసు నమోదు చేసి జరిమానా వేశారు. తవ్వకాలు జరిగే చోట ఉన్న ఆరు టిప్పర్ లారీలు, రెండు పొక్లెయిన్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని, రాంబిల్లి రెవెన్యూ సిబ్బందికి మైనింగ్ అధికారులు అప్పగించారు.