
తాచేరు కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదన
పరిశీలించిన ఆర్‌అండ్‌బీ అధికారులు
మాడుగుల రూరల్: మండలంలో కె.జె.పురం తాచేరు వంతెన పక్కన కూలిపోయిన కల్వర్టును మాడుగుల ఆర్‌అండ్‌బీ జేఈ వి. సాయి శ్రీనివాస్, వర్కు ఇన్‌స్పెక్టరు పైలా దేముడునాయుడు బుధవారం పరిశీలించారు. దీనికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా నీటి ప్రవాహానికి మళ్లీ దెబ్బతింటుందని జేఈ తెలిపారు. దీనిదృష్ట్యా శ్లాబ్ కల్వర్టు నిర్మాణానికి రూ.30 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇన్‌చార్జి భీశెట్టి విజయలక్ష్మి, మద్దాల ప్రసాదు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఇక్కడ కల్వర్టు పూర్తిగా దెబ్బతినడం వల్ల కె.జె.పురం నుంచి చోడవరం వెళ్లే వాహనాలు వంటర్లపాలెం మీదుగా నడుపుతున్నారు.