
వుషూ జాతీయ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
కోచ్‌లతో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు
సాధించిన విజేతలు
నర్సీపట్నం: రాజమండ్రిలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి వుషూ చాంపియన్‌షిప్ పోటీల్లో నర్సీపట్నం క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగిన పోటీల్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకులం నుంచి పరవాడ జోత్స్న మేరీ, వేంపాటి ప్రణీతి మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. వీరిద్దరు ఈ నెలాఖరున మణిపూర్‌లో జరగనున్న 69వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్ –19 పోటీల్లో పాల్గొంటారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. పెంట దుర్గాభవాని రజత పతకం, వెన్నెల కావ్య కాంస్య పతకం సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థినులు, పీడీ సాయి, వీరికి తర్ఫీదు ఇచ్చిన వుషూ కోచ్ ప్రియాంకను ప్రిన్సిపాల్ రాజేశ్వరి అభినందించారు.