
ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) చీఫ్ ఆఫ్ స్టాఫ్(ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మనోజ్ ఝా డీఎస్‌ఎస్‌సీ (వెల్లింగ్టన్), యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో విద్యనభ్యసించారు. 1995 జనవరి 1న నౌకాదళంలో ఫ్లాగ్ ఆఫీసర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గోవాలోని నావల్ అకాడమీ, ఇండియన్ నావల్ వార్ కాలేజ్ (గోవా)లో విధులు నిర్వర్తించారు. గన్నరీ నిపుణుడైన మనోజ్ ఝా.. ఐఎన్‌ఎస్ చైన్నె యుద్ధ నౌకకు కమాండ్ ఆఫ్ డిస్ట్రాయర్‌గా విధులు నిర్వహించారు. ఏఎస్‌డబ్ల్యూ కర్వెట్ ఐఎన్‌ఎస్ కమోర్తా యుద్ధ నౌకకు మొట్టమొదటి కమాండింగ్ ఆఫీసర్‌గా, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విరాట్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విజయవంతంగా బాధ్యతలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కు రావడం గర్వంగా ఉందని మనోజ్ ఝా ఈ సందర్భంగా తెలిపారు.