అచ్యుతాపురం: మాతా, శిశు మరణాలను నివారించేందుకు వైద్య సిబ్బంది మరింత కృషి చేయాలని మెడికల్ టాస్క్ ఫోర్స్ జిల్లా ప్రధాన అధికారి జె.ప్రశాంతి అన్నారు. మండలంలో గల హరిపాలెం పీహెచ్‌సీ పరిధిలోని కొండకర్ల విలేజ్ హెల్త్ క్లినిక్‌ను టాస్క్ ఫోర్స్ బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ పిల్లలు,గర్భిణులు,బాలింతలలో రక్త హీనత లేకుండా వైద్య సలహాలు,వైద్య సహాయం అందించాలన్నారు. ప్రతీ కాన్పు కచ్చితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో పరిసరాల పరిశుభ్రత ఎంత కీలకమో ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. ఈమేరకు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా గణాంకాధికారి రామచంద్రరావు, ఐడీఎస్ పీకో ఆర్డినేటర్ జనార్దన్, ఎంపీహెచ్‌ఓ శ్రీనివాస్, ఆరోగ్య బోధకులు రామలక్ష్మి, ఆరోగ్య పర్యవేక్షకులు సునీత, ఉమా మహేశ్ పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్ జిల్లా ప్రధాన అధికారి ప్రశాంతి