
సారాసురులపై రణభేరి
రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోమవారం కదం తొక్కాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, ఎకై ్సజ్ స్టేషన్ల ముట్టడి, ధర్నా కార్యక్రమాలు
నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పాయకరావుపేటలో నిరసన ర్యాలీ చేపడుతున్న కంబాల జోగులు, బొడ్డేడ ప్రసాద్, చిక్కాల, వీసం, నాయకులు
చోడవరం ఎకై ్సజ్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న మహిళలు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు,
సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యంపై మహిళలు కదం తొక్కారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతృత్వంలో పోరుబాట పట్టారు. కల్తీ మద్యం తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమల్లా నడుస్తున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఆందోళనలు చేపట్టారు. వర్షం పడుతున్నా.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మహిళలు పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు చేపట్టారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఎకై ్సజ్ అధికారులకు అందజేశారు.
పాయకరావుపేటలో సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో సోమవారం ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ర్యాలీగా వెళ్లి ఎకై ్సజ్ సీఐ జి.శ్రీనివాసరావుకు నారా వారి నకిలీ మద్యం అరికట్టాలని వినతి పత్రం అందించారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో ఆ నియోజకవర్గం సమన్వయకర్త పెట్ట ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నల్లబాడ్జీలు ధరించి ఎకై ్సజ్ సీఐ సునీల్‌కుమార్‌కు కల్తీ మద్యం అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడి శిష్యుడు, మాకవరపాలెం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు రుత్తల రాము పరవాడ ప్రాంతంలో కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ మద్యంతో ఇటీవల పట్టుబడ్డారన్నారు. నర్సీపట్నంలో ఉన్న మద్యం దుకాణాలు స్పీకర్ అనుచరులేవేనన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, పట్టణ మహిళా అధ్యక్షురాలు కణితి అన్నపూర్ణ, పాల్గొన్నారు.
యలమంచిలిలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. ఎకై ్సజ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి కల్తీ మద్యం అరికట్టాలని నినాదాలు చేశారు. ఇన్‌చార్జ్ ఎకై ్సజ్ సీఐ ఎం.జ్ఞానేశ్వరికి రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఎస్‌ఈసీ సభ్యుడు బొదెపు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సీఐ వై.లక్ష్మణనాయుడుకు పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం నేతలు వినతిపత్రం అందజేశారు. పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్టీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కటకటాలపాలు చేయాలి
చోడవరంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ర్యాలీ నిర్వహించిన అనంతరం చోడవరం ఎకై ్సజ్ కార్యాలయాన్ని ఆ పార్టీ శ్రేణులు, మహిళలు ముట్టడించారు. అమర్‌నాథ్ మాట్లాడుతూ.. కల్తీ మద్యం తయారీదారులందర్నీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దంతులూరి దిలీప్‌కుమార్, ఏడువాక సత్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
అర్ధరాత్రి బార్లా మద్యం దుకాణాలు
మాడుగులలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్ వన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పాల్గొన్నారు. ప్లకార్డులతో మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం ఎకై ్సజ్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయని, అర్ధరాత్రి కూడా తెరిచి ఉంటున్నాయని విమర్శించారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు బాగా పెరిగిపోయాయన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

సారాసురులపై రణభేరి

సారాసురులపై రణభేరి

సారాసురులపై రణభేరి

సారాసురులపై రణభేరి