
ఎస్పీ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధులపై ప్రతి వ్యక్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రం కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు వివిధ రకాలైన అంటు వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుద్ధి, వేడిచేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. దోమల పెరుగుదలకు కారణమయ్యే నిల్వ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కోరారు. స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించగా, వరదల ప్రభావం తగ్గించే చర్యలు, అంటువ్యాధుల నివారణ, ఫాగింగ్ వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీఐలు టి.లక్ష్మి, బెండి వెంకటరావు, రమేష్, ఎస్‌ఐలు సురేష్ బాబు, వెంకన్న, మల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.