
జూనియర్ కళాశాలల అథ్లెటిక్స్, రగ్బీ పోటీలు ప్రారంభం
ఏఎంఏఎల్ కళాశాలలో అథ్లెటిక్స్, రగ్బీ పోటీల ప్రారంభోత్సవంలో క్రీడాకారులు, నిర్వాహకులు
తుమ్మపాల: మండలంలో ఏఎంఏఎల్ కళాశాలలో ఉమ్మడి జిల్లా జూనియర్ కళాశాలల అథ్లెటిక్స్, రగ్బీ, పోటీలను కళాశాల అధ్యక్షులు శ్రీధరాల కృష్ణ పేర్రాజు, కరస్పాండెంట్ పెంటకోట వెంకటరామారావు శనివారం ప్రారంభించారు. కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 100మీ., 200మీ., 400మీ., 800మీ., 1500మీ., 3,4,6 కిలోమీటర్లు, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, లాంగ్ జంప్, త్రిపుల్ జంప్, హైజంప్, రగ్బీ పోటీల్లో అండర్ 19 విభాగంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో వివిధ కళాశాలల క్రీడాకారులు తలపడ్డారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విశాఖ జిల్లా అథ్లెటిక్ అండర్ –19 జట్టుకు ఎంపిక చేసి త్వరలో ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జయబాబు, ఎం.వినోద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 విశాఖ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఏ పుష్పలత, వైస్ ప్రిన్సిపాల్ టి.నిరంజన్ కుమార్, సూపరింటెండెంట్ పి.అనురాధ, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు వాసిరెడ్డి బాలకృష్ణ, కె.రవీంద్ర, యు.కృష్ణ కిషోర్, పి.వి. సుధాకర్, ఫిజికల్ డైరెక్టర్లు శ్రీలక్ష్మి, ఉమ, సాగర్, తరుణ్, ప్రసాద్, సావిత్రి, డాక్టర్ కె.వి.ఎస్ నాయుడు, కె.శత్రుఘ్న పాల్గొన్నారు.