
వాతావరణం అనకాపల్లి: రాగల ఐదురోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉం
న్యూస్‌రీల్
వెలుగు వీవోఏల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం అనకాపల్లి డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ తీరును రైతులు నిరసించారు.
పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పత్రికల స్వేచ్ఛను పోలీసు కేసులతో ప్రభుత్వం హరిస్తామంటే ఎలా..? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్‌మీట్ వార్తగా రాస్తే.. సంబంధిత జర్నలిస్టుతో పాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. మీడియా గొంతును నొక్కే ప్రయత్నాలకు పాల్పడుతోంది. అక్షరాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను నోటీసు లు, అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది.
– పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే
ప్రభుత్వ తీరు దారుణం
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. తాజాగా పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరిస్తోంది. జర్నలిస్టులపై, సాక్షిపై వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. విలేకరుల సమావేశంలో నాయకుల మాటలను వార్తలుగా ప్రచురిస్తే పత్రికలపై కేసులు పెట్టడం చరిత్రలో తొలిసారి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే బాధ్యత మీడియాపై ఉంది. రాష్ట్రంలోని ప్రజలు ప్రతీ అంశాన్ని గమనిస్తున్నారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి తగదని గుణపాఠం తప్పదు.
– అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే

వాతావరణం అనకాపల్లి: రాగల ఐదురోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉం

వాతావరణం అనకాపల్లి: రాగల ఐదురోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉం