
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
కేజీబీవీని తనిఖీ చేస్తున్న డీఈవో
బుచ్చెయ్యపేట: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. వడ్డాది కేజీబీవీని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థినుల సంఖ్య, హాజరు పట్టికలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను, తాగునీటి సరఫరా పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు సూచించారు. ఎంఈవో కాశీ విశ్వేశ్వరరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రామూర్తినాయుడు పాల్గొన్నారు.