
ఆస్తులు లాగేసి...అనాథగా వదిలేసి
మిగతా 8వ పేజీలో
సాక్షి, అనకాపల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో కశింకోటలో ఉన్న గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(ఆర్‌ఈసీఎస్)ను విలీనం చేసిన తరువాత దానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస సౌకర్యాలు లేక, ఉద్యోగులకు జీతాలందక అధ్వాన దుస్థితి నెలకింది. దీంతో సిబ్బంది కుటుంబాలు ఎనిమిది నెలలుగా అర్ధాకలితో అలమటిస్తుండగా సక్రమంగా తరగతులు సాగక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కళాశాలలో పనిచేసే ఉద్యోగులకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్ ) ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఆర్‌ఈసీఎస్ ఆస్తులు, మిగులు నిధులపై పెత్తనం చెలాయిస్తూ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. కనీసం టాయిలెట్లు శుభ్రపరచడానికి కూడా నిధులు ఇవ్వడం లేదు. స్వీపర్లకు కూడా జీతాలు చెల్లించడం లేదు. క్లాస్ రూంలో మౌలిక వసతులు, తాగునీటి సదుపాయం కల్పించలేదు. కళాశాలలో మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు, ఇతర పనులకు విద్యార్థులు, సిబ్బంది తమ సొంత సొమ్మును చెల్లిస్తున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్‌మెంట్‌లో కొంత సొమ్మును కళాశాల నిర్వహణ పనులకు ఖర్చు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా నిలిచిపోయింది. కళాశాలలో రాజ్యమేలుతున్న సమస్యలను ఆర్‌ఈసీఎస్‌కు గౌరవ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ విజయకృష్ణన్, సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్న ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) ప్రసాద్ దృష్టికి పలుమార్లు కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులైన గ్రామీణ వినియోగదారులు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. స్థానిక కూటమి పార్టీ ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా.. పట్టించుకున్న పాపానపోలేదు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం లేదు. ఈపీడీసీఎల్ వైఖరి, జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా కారణంగా తరగతులు సరిగ్గా జరగడం లేదని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తల్లిదండ్రులు, వినియోగదారులు వాపోతున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించాలని విద్యార్థి, వినియోగదారుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్‌ఈసీఎస్‌లో
ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ గాలికి... ఆస్తులపై పెత్తనం తప్ప బాధ్యతలు తీసుకోని ఈపీడీసీఎల్ 8 నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం తరగతులు సక్రమంగా సాగక విద్యార్థులకు ఇబ్బందులు
‘నా పేరు రాజేష్(పేరు మార్పు). నేను ఆర్‌ఈసీఎస్ అనుబంధ రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కళాశాలలో క్లీనింగ్ చేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులందరం కలిసి చందాలు వేసుకుని వారికి ఇస్తున్నాం. టాయిలెట్ల క్లీనింగ్ కూడా మేమే చేసుకుంటున్నాం. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వచ్చే డబ్బులతో కళాశాల మెయింటేనెన్స్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడంతో క్లాసులు సరిగ్గా జరగడం లేదు. కాలేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది.’ ఇదీ ఈ ఒక్క విద్యార్థి ఆవేదనే కాదు పాలిటెక్నిక్ విద్యార్థులందరిదీ..ఆర్‌ఈసీఎస్ చేతికి వచ్చాక ఆస్తులు, మిగులు నిధులపై పెత్తనం చేస్తున్న ఈపీడీసీఎల్...ఆర్‌ఈసీఎస్‌కు చెందిన పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోకుండా అనాథగా వదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.