
సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
పెందుర్తిలో
‘కూటమి’ సిగపట్లు
● పెత్తనం కోసం ఎమ్మెల్యే పంచకర్ల..
టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి పాట్లు
● ఒకరిపై ఒకరు తమ తమ
అధిష్టానానికి ఫిర్యాదులు
● మీడియా ముఖంగా బహిర్గతం
చేసిన గండి బాబ్జి
పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పత్రికల స్వేచ్ఛను పోలీసు కేసులతో ప్రభుత్వం హరిస్తామంటే ఎలా..? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్‌మీట్‌ను వార్తగా రాస్తే.. సంబంధిత జర్నలిస్టుపై, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. ప్రజల గొంతుకుగా నిలిచే మీడియా గొంతును నులిమే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపుల ధోరణికే పాల్పడుతోంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పత్రికలపై కక్ష కట్టిన ఏ నాయకుడూ బాగుపడిన దాఖలా చరిత్రలో లేదు. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ మాజీ విప్
రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు
ప్రపంచంలోనే అత్యంత దృఢమైనదని భారత రాజ్యాంగానికి పేరు. అలాంటి రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండడానికే మీడియాను అణగదొక్కుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రెస్‌మీట్‌ను వార్తగా రాస్తే కేసు ఎలా నమోదు చేస్తారు? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే. రాజకీయ పార్టీల నాయకులు ప్రెస్‌మీట్‌ల ద్వారా వెల్లడించిన అంశాలను వార్తగా మలిచే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. నాయకులు మీడియా సమావేశాలు పెట్టి అనేక అంశాలు మాట్లాడతారు. వాటిని వార్త రూపంలో ప్రజలకు చేరువేయడంతో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. అంతమాత్రాన వార్త రాసిన జర్నలిస్టుపై, పత్రిక ఎడిటర్‌పై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేడయం సరికాదు.
– తైనాల విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే

సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025