
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
● 3 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, బైక్ సీజ్
దేవరాపల్లి: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను దేవరాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీరాంపురం వై జంక్షన్ వద్ద గురువారం ఎస్‌ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. విశాఖ సిటీలోని కంచరపాలేనికి చెందిన సిహెచ్. కార్తీక్, సబ్బవరానికి చెందిన సిహెచ్. ఎర్నిబాబు వేలంమామిడిలో గంజాయి కొనుగోలు చేసి దేవరాపల్లి మీదుగా బైక్‌పై తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరి నుంచి 3 కేజీల గంజాయిని, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చోడవరం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.