
వృద్ధురాలి ఆత్మహత్య
కోటవురట్ల: అనారోగ్య కారణాలతో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి.. మండలంలోని రాజుపేట శివారు పి.రామన్నపాలేనికి చెందిన పల్లా సింహాచలం(66) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. కొంత కాలంగా ఆరోగ్యం బాగుండకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన ఇంటి బాత్రూంలో ఇనుప రాడ్‌కు నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెద్ద కుమారుడు వెంకునాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.