
మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
హోంగార్డు జనపాల అప్పలనాయుడు భార్య సత్యవతికి చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: నర్సీపట్నం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు జనపాల అప్పలనాయుడు కుటుంబానికి బుధవారం ఎస్పీ తుహిన్ సిన్హా ఆర్థిక సాయం అందజేశారు. హోంగార్డుల ఒక రోజు వేతనం నుంచి రూ. 3,78,430 చెక్కును మృతుడు భార్య సత్యవతికి తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధుల నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం అభినందనీయమన్నారు.