
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మెరిసిన నాగజ్యోతి
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తలపడుతున్న ఉపాధ్యాయిని నాగజ్యోతి
రోలుగుంట: రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఈ నెల 26, 27 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. అమరావతి పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఆమె వివిధ విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. సబ్ జూనియర్, జూనియర్ విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. 74 కిలోల మాస్టర్స్ విభాగంలో స్కౌట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ విభాగాల్లో విజేతగా నిలిచిన నాగజ్యోతికి ఏఎంసీ డైరెక్టర్ దుగ్గిరాల, ఎంపీటీసీ మధుబాబు మూడు బంగారు పతకాలు ప్రదానం చేశారు.