
ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపు నీరు
నాతవరం: మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ కార్యాలయాలు నీటి ముంపునకు గురయ్యాయి. ఇక్కడ ఎంపీడీవో కార్యాలయానికి ఇరువైపులా నీరు చేరడంతో ఇబ్బంది ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఆవరణ చెరువును తలపించింది. వ్యవసాయ శాఖ గిడ్డంగి కార్యాలయం చుట్టూ నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎంఈవో కార్యాలయం ముందు భాగంలో నీరు నిలిచిపోయింది. బురదమయంగా ఉండటంతో కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కొద్దిపాటి వర్షం పడినా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నీరు చేరడంతో పనులు మీద వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాలు లోతట్టులో ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది.