
జాతీయ స్థాయి హాకీ పోటీలకు నలుగురు ఎంపిక
జాతీయ సబ్ జూనియర్ హాకీ పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు
యలమంచిలి రూరల్: జిల్లాకు చెందిన నలుగురు హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీలకు ఎంపికై నట్టు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారు నరేష్ తెలిపారు. పండూరి భరత్, చరణ్, దేవేందర్ వెంకట్, స్వరూప్‌లు ఈ నెల 28 నుంచి చైన్నెలో జరగనున్న హాకీ పోటీల్లో ఏపీ జట్టు తరఫున పాల్గొంటారని తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో నక్కపల్లికి చెందిన ఇద్దరు, అనకాపల్లి, యలమంచిలి పట్టణాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారని చెప్పారు.